: నాగార్జున వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ: మంత్రి గంటా


నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని చెప్పారు. కమిటీ సభ్యులుగా సింహపురి వర్సిటీ ఉపకులపతి వీరయ్య, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మీ, వెంకటేశ్వర వర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు ఉన్నారని తెలిపారు. ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News