: శ్రీకాకుళం జిల్లాలో ఆటోలో పది నాటు తుపాకులు


శ్రీకాకుళం జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. జిల్లాలోని పాలకొండ మండలం గోపాలపురం దగ్గర రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో, ఒక ఆటోలో ఉన్న పది నాటు తుపాకులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను తీసుకొస్తున్న ఆటో సీతంపేట మండలం ఈతమానుగూడ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News