: మీకు మామిడిపళ్లు...ప్రజలకు తుపాకీ గుళ్లు: పొన్నం


పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ లోని దీనానగర్ లో జరిగిన ఉగ్రదాడిని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీకి మామిడిపళ్లు పంపిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ లోని ప్రజల మీదకి ఉగ్రవాదులను పంపాడని మండిపడ్డారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకునే ప్రధానులు ప్రజలను హత్యచేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని పాలించేందుకు 56 అంగుళాల ఛాతీ కలిగిన వ్యక్తి కావాలని చెప్పిన మోదీ, ఆ ఛాతీతో ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షాత్తూ అధికార భాగస్వామిగా ఉన్న బీజేపీ, జమ్మూకాశ్మీర్ లో యథేచ్ఛగా పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగురుతుంటే ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఇప్పుడు యాకూబ్ మెమన్ ఉరి అంశాన్ని బీహార్ ఎన్నికల్లో వాడుకుందామని మోదీ చూస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News