: మెమన్ క్షమాభిక్ష పిటిషన్ పై రేపు కూడా సుప్రీంకోర్టులో విచారణ
ముంబయి వరుస పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ క్షమాభిక్షపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30న తనకు విధించనున్న ఉరిశిక్షపై స్టే ఇవ్వాలంటూ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించగా, ఈ రోజు కొద్దిసేపు వాదనలు జరిగాయి. అయితే పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. దాంతో రేపు కూడా మెమన్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగనుంది.