: సల్మాన్ కేసులో ఈ నెల 30 నుంచి తుది విచారణ


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో తుది విచారణ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి బాంబే హైకోర్టు విచారణను మొదలుపెట్టనుందని ఓ ప్రకటన వెలువడింది. ఈ కేసులో ఆయనకు ముంబై సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రెండు నెలల కిందట హైకోర్టు రద్దు చేసింది. ఆ వెంటనే సల్మాన్ కు బెయిల్ కూడా లభించింది. తరువాత జైలు శిక్ష తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దానిపైనే తాజాగా విచారణ జరగనుంది. మరోవైపు సల్మాన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News