: గురుదాస్ పూర్ లో ఎన్ కౌంటర్ ముగిశాక హోంమంత్రి ప్రకటన చేస్తారు: లోక్ సభలో వెంకయ్యనాయుడు


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై పార్లమెంటులో ప్రకటన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, కాల్పులు ముగిశాక హోంమంత్రి ప్రకటన చేస్తారని మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంపై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు. గురుదాస్ పూర్ ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ ప్రకటన చేయాలంటూ లోక్ సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెంకయ్య పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News