: భారత్-పాక్ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించండి... అప్రమత్తంగా ఉండండి: రాజ్ నాథ్ సింగ్ ఆదేశం


భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి జరిపారు. సైనిక దుస్తుల్లో వచ్చిన వీరు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పోలీసులు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రదాడులపై పూర్తిగా దృష్టి సారించారు. ఢిల్లీ నుంచే పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పంజాబ్ పోలీసులకు సహకరించాలని బీఎస్ఎఫ్ బలగాలను ఆదేశించారు. మరోవైపు, అంతర్జాతీయ సరిహద్దుపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని... బోర్డర్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తో ఆయన ఫోన్లో మాట్లాడారు.

  • Loading...

More Telugu News