: కొనసాగుతున్న కాల్పులు...ఓ ఉగ్రవాది హతం


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనా నగర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. నేటి ఉదయం సైనిక దుస్తుల్లో వచ్చి, మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులను పోలీసులు కూడా దీటుగానే ఎదుర్కొన్నారు. అయితే అప్పటికే భారీ నష్టమే జరిగిపోయింది. ఉగ్రవాదుల కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఎస్జీ కమాండోలు ఉగ్రవాదులను వేటాడుతున్నారు. స్థానిక పోలీసు బలగాలతో కలిసి ఎన్ఎస్జీ జరుపుతున్న ఉమ్మడి ఆపరేషన్ లో ఇప్పటిదాకా ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం అక్కడ హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News