: ఉగ్రవాదులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారు: పోలీసు అధికారి


పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న దీనానగర్ పోలీస్ స్టేషన్ తో బాటు, ఓ బస్సుపై ఈ తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన దాడి వివరాలను గాయపడిన పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఉగ్రవాదులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారని తెలిపారు. అందరూ సైనికుల దుస్తుల్లో స్టేషన్ లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెప్పారు. దాదాపు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారన్నారు. వారంతా జమ్మూకాశ్మీర్ లోని హీరానగర్ నుంచి వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News