: అద్వానీకి పద్మభూషణ్ ఇచ్చారు... నాకైతే పాస్ పోర్టు కూడా ఇచ్చేవారు కాదు: అసదుద్దీన్ ఒవైసీ


సాక్షాత్తు ఇందిరాగాంధీయే హైదరాబాదులోని తమ కార్యాలయానికి వచ్చారని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ మా మద్దతు కోరే రోజు తప్పక వస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతోందని, తమను మతతత్వవాదులు అంటూ విమర్శిస్తోందని, తమపై కొందరు కాంగ్రెస్ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న మెమెన్ కు న్యాయం జరగాలని తాను కోరడంలో తప్పేం లేదని అసద్ స్పష్టం చేశారు. మెమెన్ స్థానంలో హిందువు ఉన్నా తాను ఇదే విధంగా స్పందించేవాడినని తెలిపారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీపై బాబ్రిమసీదు కేసు ఉన్నా ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారని... తనపై ఏదైనా కేసు ఉంటే పాస్ పోర్టు కూడా ఇచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News