: ‘ఉగ్ర’ దాడిపై మోదీ క్విక్ రియాక్షన్!... కాసేపట్లో హోంశాఖతో అత్యవసర భేటీ


ఉగ్రవాద దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్, అక్కడికి సమీపంలోని పోలీస్ క్వార్టర్లపై నేటి ఉదయం ఉగ్రవాదులు ఏకకాలంలో దాడులకు దిగారు. దాడిపై సమాచారం అందుకున్న మోదీ హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. దాడిపై సమగ్ర వివరాలను ప్రధానికి తెలియజేశారు. ఇదిలా ఉంటే, మరికాసేపట్లో హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News