: రంగంలోకి రాజకీయ నేతలు... ‘రియల్’ మాఫియాను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి
గుంటూరు జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై దాడికి తెగబడ్డ రియల్ మాఫియాకు మద్దతుగా రాజకీయ నేతలు రంగప్రవేశం చేశారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై రియల్ మాఫియా దాడి దృశ్యాలు ఓ వార్తా చానెల్ ప్రసారం చేయడంతో రంగంలోకి దిగిన మంగళగిరి పోలీసులు కరీముల్లా, సుభానీ సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారికి అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలతోనూ మంచి సంబంధాలున్నాయట. ఈ నేపథ్యంలో సదరు రెండు పార్టీలకు చెందిన నేతలు రియల్ మాఫియా ముఠా సభ్యులను విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు మంగళగిరి పోలీసులపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తోందట.