: ఆ ట్వీట్లు సరికాదని మా నాన్న చెప్పాడు... ఉపసంహరించుకుంటున్నా: సల్మాన్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్ష విషయయై తాను చేసిన ట్వీట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ట్విట్టర్లో ప్రకటించారు. ఆ ట్వీట్లను ప్రజలు మరోలా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని తన తండ్రి చెప్పారని, అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు వివరించారు. తన ట్వీట్లు ఎవరినైనా బాధించి ఉంటే, అందుకు బేషరతుగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. చేసిన నేరాలకు టైగర్ మెమన్ ను ఉరితీయాలన్న వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని, అయితే, టైగర్ చేసిన తప్పులకు యాకూబ్ ను బలిచేయకూడదన్న ఉద్దేశంతోనే తాను ఇంతకుముందు ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. దేశ న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని ఉద్ఘాటించారు. ఆ ట్వీట్లు మత వ్యతిరేక ధోరణిలో చేసినవంటూ వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News