: ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కు పితృవియోగం
సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కు పితృవియోగం కలిగింది. ఏకే ఖాన్ తండ్రి అబ్దుల్ కరీం ఖాన్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఖాన్ తండ్రి మరణించడంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.