: తెలంగాణ క్రికెట్ సంఘం ప్రారంభం... చైర్మన్ గా ఈటెల ఎన్నిక
జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా హైదరాబాద్ క్రికెట్ సంఘమే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించేది. ఇప్పుడు అచ్చంగా తెలంగాణ కోసమే ఓ క్రికెట్ సంఘం తెరపైకి వచ్చింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) పేరిట ఏర్పాటైన ఈ క్రికెట్ పాలక వ్యవస్థకు చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎన్నికయ్యారు. టీసీఏ చీఫ్ ప్యాట్రన్ గా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ప్యాట్రన్లుగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తారు. ఇక, క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా యెండల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడిగా వీరేందర్ గౌడ్, వైస్ చైర్మన్ గా బీబీ పాటిల్, వైస్ ప్రెసిడెంట్ కమ్ ట్రెజరర్ గా సీఎల్ రాజం ఎన్నికయ్యారు. కాగా, క్రికెట్ సంఘాల్లో కార్యదర్శి పదవిని అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ పదవికి గురవారెడ్డి ఎన్నికయ్యారు.