: సల్మాన్ పై దాడి మొదలైంది!
ముంబయి పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ఉరిశిక్ష విషయంలో ట్వీట్లు చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై విమర్శల దాడి మొదలైంది. సల్మాన్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టింది. సోమవారం పార్లమెంటులో సల్మాన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. అటు, శివసేన కూడా సల్మాన్ ట్వీట్లపై మండిపడింది. సల్మాన్ న్యాయస్థానం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? అని ప్రశ్నించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సైతం శివసేన తరహాలోనే స్పందించింది. న్యాయస్థానం తీర్పును ప్రశ్నించరాదని బాలీవుడ్ హీరోకు హితవు పలికింది.