: పోటీ పడి పనిచేశారంటూ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన చంద్రబాబు
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం మహాపుష్కర అభినందన సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుష్కరాల్లో విస్తృత సేవలు అందించిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అధికారులు పోటీ పడి పనిచేశారంటూ కితాబిచ్చారు. తొలి రోజు జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు జాగ్రత్తగా, పట్టుదలతో పనిచేశారని అభినందించారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. కాగా, పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన సిబ్బందికి ముఖ్యమంత్రి రెండు రోజులు సెలవు ప్రకటించారు. మొత్తమ్మీద పుష్కరాలు జయప్రదం చేశారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.