: రాహుల్ గాంధీకి భయపడే కేసీఆర్ ఉద్యోగ ప్రకటన: వీహెచ్ ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి ఉస్మానియా యూనివర్శిటీలో బహిరంగ సభ పెడితే, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే హుటాహుటిన కొత్త ఉద్యోగాలిస్తున్నట్టు ప్రకటనలు వెలువరించారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయనిచ్చిన హామీ ఏమయిందని ప్రశ్నించారు. తక్షణం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను నమ్మిన నిరుద్యోగ యువత, అధికారాన్ని అప్పగిస్తే, కుర్చీలో కూర్చున్న తరువాత కేసీఆర్ అందరినీ మర్చిపోయారని విమర్శించారు. నిరుద్యోగులు చేసే ఉద్యమాలకు తాము అండగా ఉంటామని తెలిపారు.