: ఒక్కొక్క భారతీయుని తలపై ఉన్న రుణభారం ఎంతో తెలుసా?


2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రతి భారతీయునిపై సగటున రూ. 44,095 రుణ భారం ఉందని వరల్డ్ బ్యాంకు వెల్లడించింది. 2013-14లో తలసరి రుణభారం రూ. 41,129 కాగా, అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా వెచ్చించడంతో రుణభారం రూ. 2,966 పెరిగిందని వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన ఇంటర్నేషనల్ డెబిట్ స్టాటిస్టిక్స్ వివరించాయి. విదేశీ రుణాలు అత్యధికంగా తీసుకుంటున్న 20 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది. ప్రస్తుతం భారత్ మొత్తం రూ. 68.95 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

  • Loading...

More Telugu News