: 'టైగర్' కాదది... పిల్లి!: సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్లు
ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్షను ఎదుర్కోనున్న యాకూబ్ మెమన్ ను కండల వీరుడు సల్మాన్ ఖాన్ వెనకేసుకొచ్చాడు. యాకూబ్ ను ఉరి తీయవద్దని, అతని సోదరుడు, కేసులో ప్రధాన దోషి అయిన టైగర్ మెమన్ ను పట్టుకొచ్చి బహిరంగంగా ఉరి తీయాలని ట్వీట్ చేశాడు. తమ్ముడు ఉరికంబం ఎక్కుతుంటే, తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్... టైగరే కాదు, పిల్లి అని అన్నాడు. తప్పించుకు తిరిగే పిల్లిని పట్టుకోలేమని వ్యాఖ్యానించాడు. ఇండియాలో టైగర్ల కొరత ఉందని, ఆ టైగర్ ను పట్టుకు రావాలని, టైగర్ అని పిలిపించుకునే అర్హత అతనికి లేదని అన్నాడు. తన ఈ అభిప్రాయం చెప్పడానికి మూడు రోజులు ఆలోచించినట్టు తెలిపాడు.