: రేపు, ఎల్లుండి స్నాప్ డీల్ లో భారీ ఆఫర్లతో అమ్మకాలు


ఈ-కామర్స్ సేవల సంస్థ స్నాప్ డీల్ రేపు, ఎల్లుండి భారీ ఎలక్ట్రానిక్ సేల్స్ చేపట్టనుంది. ఇందులో భాగంగా పలు రకాల ప్రొడక్టులపై 70 శాతం వరకూ డిస్కౌంట్లను అందిస్తామని చెబుతోంది. వీటితో పాటు అన్ని బ్రాండ్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తామని పేర్కొంది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు తదితరాలపై ఆకర్షణీయ ఆఫర్లు ఉంటాయని స్నాప్ డీల్ వివరించింది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలు భారీగా జరుగుతాయని భావిస్తున్నామని సంస్థ ఎలక్ట్రానిక్స్‌, హోమ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ టోని నవిన్‌ వివరించారు. కస్టమర్ల కోసం ఏడు లక్షలకు పైగా ప్రొడక్టులను సిద్ధంగా ఉంచామని, కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీ ఇస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News