: పోలీసుల భారీ భద్రత మధ్య 'నాగార్జున' వర్సిటీలో కులాల బోర్డుల తొలగింపు
నాగార్జున వర్సిటీలో ఉన్న పలు కుల సంఘాల బోర్డులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ ఉదయం తొలగించారు. బోర్డులు తొలగిస్తున్న సమయంలో మీడియాను సైతం అనుమతించలేదు. ఇటీవల యూనివర్సిటీ పర్యటనకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాస్, కులాలను తెలుపుతూ ఉన్న బోర్డులను తొలగించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఉన్న సమయంలో వాటిని తీస్తే, గొడవలు జరగవచ్చని భావించిన వర్శిటీ అధికారులు, పది రోజుల సెలవులను ప్రకటించిన తరువాత ముందడుగు వేశారు. బోర్డులన్నీ తొలగించామని, ఇకపై కులాల పేర్లను ప్రస్తావిస్తూ బోర్డులు పెడితే, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.