: భారీ ఎత్తున ఫేక్ ఐఫోన్లు తయారు చేస్తున్న చైనా సంస్థ గుట్టు రట్టు


భారీ ఎత్తున నకిలీ ఐఫోన్లను తయారు చేసి ప్రపంచ మార్కెట్లోకి పంపుతున్న ఓ కంపెనీ గుట్టును చైనా పోలీసులు రట్టు చేశారు. బీజింగ్ కేంద్రంగా నడుస్తున్న ఓ సంస్థ 19.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.125 కోట్లు) విలువైన 40 వేల నకిలీ యాపిల్ ఐఫోన్లను తయారు చేసిందని గుర్తించారు. కంపెనీ ఫ్యాక్టరీపై దాడి చేసిన చైనా పోలీసులు తొమ్మిది మంది అనుమానితులను, 10 లక్షలకు పైగా సెల్ ఫోన్ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారని న్యూస్ ఏజన్సీ 'క్సిన్హువా' తెలిపింది. గడచిన మే నెలలో చైనాలో తయారైన నకిలీ ఐఫోన్లు అమెరికాలో పట్టుబడిన నేపథ్యంలో, పోలీసులు విచారణ ప్రారంభించి ఈ సంస్థ ప్రమేయాన్ని పసిగట్టినట్టు తెలిసింది. సంస్థలో వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారని, విదేశాల నుంచి పాత ఫోన్ల బోర్డులను కొనుగోలు చేసి వాటితో నకిలీ ఐఫోన్లను తయారు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News