: రైల్వే టికెట్లూ 'క్యాష్ ఆన్ డెలివరీ'... బుక్ మై ట్రైన్ యాప్ వచ్చేసింది!


రైల్వే టికెట్ల బుకింగ్ సేవలందిస్తున్న ఐఆర్ సీటీసీ, 'బుక్ మై ట్రయిన్' పేరిట సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది. ఇప్పటివరకూ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్ అవకాశాలు కల్పిస్తున్న ఐఆర్ సీటీసీ, ఈ యాప్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' (సీఓడీ) సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి పైలట్ ప్రోగ్రామ్ గా దీన్ని మొదలు పెట్టామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్లతో పాటు బ్లాక్ బెర్రీ ఫోన్లలో పనిచేసేలా యాప్ ను తీర్చిదిద్దామని తెలిపింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు సీఓడీ విధానాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో సీఓడీ విధానంలో టికెట్లను బుక్ చేసుకోవచ్చని, ఆగస్టు నాటికి మరో 700 పట్టణాలకు దీన్ని విస్తరిస్తామని వివరించింది.

  • Loading...

More Telugu News