: బాల కార్మిక మాఫియా కుట్ర భగ్నం


బాలల చేత వెట్టి చాకిరీ చేయించేందుకు తరలిస్తున్న భారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాదు రైల్వే స్టేషనులో జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు 88 మంది బాలలను రక్షించారు. 10 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసు స్టేషనుకు తరలించారు. బాలలంతా బీహార్, ఒడిశా, చత్తీస్ గఢ్ తదితర ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బాలలను తిరిగి వారి ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News