: పుష్కరాలు ఇంకా ముగియలేదు!


పుష్కరాలు ఇంకా ముగియలేదు. బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఒక్కో నదికి పుష్కరం వస్తుందని అందరికీ తెలిసిందే. పుష్కరకాలలం సుమారు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. పుష్కరుడు వచ్చే సంవత్సరం వరకూ గోదావరిలోనే ఉంటాడని, ఆ తర్వాత కృష్ణా నదిలోకి వస్తాడని తెలిపిన ఆయన, పుష్కరుడు మరో రెండేళ్లు రాష్ట్రంలోనే ఉంటాడని చెప్పారు. భక్తులు, యాత్రికులు గోదావరి నదిలో ఎప్పుడైనా పుణ్య స్నానాలు చేయవచ్చని తెలిపారు. గోదావరి పుష్కరాల అనుభవంతో వచ్చే సంవత్సరం జరిగే కృష్ణా పుష్కరాలను మరింతగా విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News