: సీఎం కాళ్లు కడిగేందుకు సిద్ధంగా ఉండండి: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు కడిగేందుకు కాంగ్రెస్ నాయకురాలు సిద్ధంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ పనులు మూడేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. మహబూబ్ నగర్ లో పెండిగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, సీఎం కాళ్లు కడుగుతామన్న కాంగ్రెస్ నాయకురాలు అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. మూడేళ్ల తరువాత మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆయన తెలిపారు.