: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్ లో ఈరోజు పసిడి ధర రూ.350 పెరిగింది. దాంతో 10 గ్రాముల ధర రూ.25,400కు చేరింది. అలాగే వెండి ధర కూడా రూ.100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.34,050 పలుకుతోంది. ప్రపంచ బులియన్ మార్కెట్ల ప్రభావం, కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధరలు పెరిగాయని, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధరలు సైతం పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.