: లక్షా పదివేల మంది ఉద్యోగులను తొలగించిన పుతిన్


లక్షా పదివేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ పచ్చజెండా ఊపారు. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పుతిన్ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. రష్యా ఇంటీరియర్ మినిస్టరీలోని లక్షా పది వేల మంది ఉద్యోగుల తొలగింపుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇంటీరియర్ మినిస్టరీలో అధికారులను పది శాతానికి తగ్గించారు. చమురు ధరలు తగ్గడం, ఉక్రెయిన్ సంక్షోభంలో పుతిన్ జోక్యంపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దానిని ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా పుతిన్ ఉద్యోగులను తొలగించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పుతిన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News