: ఇక ఆదాయమే లక్ష్యం... ఏపీలో ఆగస్టు ఒకటి నుంచి పెరగనున్న భూముల విలువ


ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 1 నుంచి భూముల విలువ భారీగా పెరగబోతోంది. ఈ మేరకు భూముల మార్కెట్ విలువల సవరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతమున్న ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా సగటున 20-25 శాతం మేర మార్కెట్ విలువలు పెరగనున్నాయని సమాచారం. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయని తెలిసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.4,200 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా పెంపుతో మరో రూ.వెయ్యి కోట్ల ఆదాయం అదనంగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News