: నిరుపేద ఖాతాలో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి!


ఒక్కసారిగా ఎవరి ఖాతాలోనైనా వాళ్ల ప్రమేయం లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడితే ఏం చేస్తారు? చడీ చప్పుడూ లేకుండా వెళ్లి విత్ డ్రా చేసుకుంటారు కదూ? అయితే, ఊర్మిళా యాదవ్ మాత్రం అలా చేయలేదు. ఎవరిదో డబ్బు తన ఖాతాలో జమ అయిందంటూ బ్యాంకు వారికి ఫిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నిరుపేద మహిళ ఉర్మిళా యాదవ్ బ్యాంకు ఖాతాలో 95 వేల కోట్ల రూపాయలు జమయ్యాయంటూ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ను చూసిన ఆమె షాక్ తింది. రెండు వేల రూపాయలతో ఎస్బీఐకి చెందిన యూపీఎస్ఐడీసీ బ్రాంచ్ లో ఖాతా తెరిచింది. రెండు వేల రూపాయలు ఉండాల్సిన ఆమె ఖాతాలో 95 వేల కోట్ల రూపాయలకు పైగా కనపడడంతో ఆమె బ్యాంకు అధికారులను కలిసి ఫిర్యాదు చేసింది. తన రెండు వేలు తనఖాతాలో ఉంచితే చాలని తెలిపింది. దీంతో జరిగిన పొరపాటు గమనించిన అధికారులు, పొరపాటుగా ఆ డబ్బు జమ అయిందని, సరిచేస్తామని తెలిపారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయనని, తన రెండు వేలు తనకు ఉంచితే సరిపోతుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News