: గోదావరి పుష్కరాల అనుభవంతో మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం: ఈటెల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి నిర్వహించిన గోదావరి పుష్కరాలపై ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పుష్కరాల్లో కొన్ని అపశ్రుతులు దొర్లినా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశామని కరీంనగర్ లో చెప్పారు. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికులు బాగా విధులు నిర్వర్తించారని, వారికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ పుష్కరాల అనుభవంతో వచ్చే మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తామని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచనలు, పద్ధతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేస్తామన్నారు.