: కోల్ కతాలో కలకలం... రైలు పట్టాలపై బాంబు
రైలు పట్టాలపై బాంబు ఉండటం కోల్ కతాలో కలకలం రేపింది. స్థానిక పార్క్ సర్కస్- సీలద్ సౌత్ స్టేషన్ల మధ్య ఈ బాంబును రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే తమ పై అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే రైళ్ల రాకపోకలను ఆపివేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, బాంబును నిర్వీర్యం చేశారు. అనంతరం రైలు సర్వీసులను పునరుద్ధరించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఎవరు పెట్టారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.