: రేవంత్ రెడ్డికి ప్రాణహాని.. కుట్ర జరుగుతోందంటున్న టీడీపీ నేత సోదరుడు


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి ప్రాణహాని పొంచి ఉందా? రేవంత్ రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందా? అంటే, అవుననే అంటున్నారు రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని అంతమొందించేందుకు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగినట్లుగా అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పాల్గొంటున్న పలు కార్యక్రమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల సంచారమే తమ అనుమానాలకు కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏదైనా జరిగితే కేసీఆర్ సర్కారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News