: ఢిల్లీలో వెంకయ్యనాయుడు ఇంటి ముందు ఏపీ విద్యార్థి జేఏసీ ధర్నా
ప్రత్యేక హోదా కోసం ఏపీ విద్యార్థి జేఏసీ ఢిల్లీలో గళమెత్తింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి ఇంటి ముందు ఈరోజు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యను డిమాండ్ చేస్తున్నారు. దానిపై ఆయన ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.