: చంద్రబాబును విమర్శించే అర్హత చిరంజీవికి లేదు: అయ్యన్నపాత్రుడు
ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి లేదని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పీఆర్పీని నడపలేక కాంగ్రెస్ లో కలిపివేసిన చరిత్ర చిరంజీవిదని... అలాంటి వ్యక్తికి బాబును విమర్శించే స్థాయి లేదని అన్నారు. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలనుకోవడం సరికాదని సూచించారు. ఈరోజు ఆయన కైకలూరులో పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అనంతరం, మీడియాతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.