: ‘బాహుబలి’ని వీక్షించిన కేంద్ర మంత్రులు...రాజమౌళి, ప్రభాస్ కు అరుణ్ జైట్లీ అభినందన


టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ సహా భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రానికి ప్రముఖుల ప్రశంసలూ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ కేబినెట్ మంత్రులు వీక్షించారు. సినిమా అద్భుతమంటూ పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లు కుటుంబ సమేతంగా బాహుబలిని వీక్షించారు. అనంతరం దర్శకుడు రాజమౌళితో పాటు లీడ్ రోల్ లో నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లపై జైట్లీ, రాథోడ్ లు ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News