: రిషికేశ్వరి ఆత్మహత్యకు నాన్ బోర్డర్సే కారణం... వర్సిటీ నుంచి తరిమేస్తామన్న గంటా


చదువు పూర్తయినా నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీల్లో తిష్టవేసిన నాన్ బోర్డర్స్ కారణంగానే బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన చోటుచేసుకుందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేటి ఉదయం ఓ తెలుగు న్యూస్ చానెల్ తో ఆయన మాట్లాడుతూ ఆచార్య నాగార్జున వర్సిటీలో పెద్ద సంఖ్యలో నాన్ బోర్డర్స్ ఉన్నారని చెప్పారు. ఈ నెల 27 తర్వాత ‘ఆపరేషన్ నాన్ బోర్డర్స్’ చేపట్టి వారినందరినీ తరిమికొడతామని ఆయన పేర్కొన్నారు. వర్సిటీల్లో ఇక ఎంతమాత్రం ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News