: టీఎస్ దర్యాప్తు సంస్థలు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనట!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురి ఫోన్లను టీఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది. అయితే, సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ సంస్థలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక విషయాలను పొందుపరిచారని ఓ కథనం. మే, జూన్ నెలల్లో కొన్ని ఫోన్లను ట్యాప్ చేయాలని తెలంగాణలోని దర్యాప్తు సంస్థలు తమను చట్ట ప్రకారం ఆదేశించాయని పిటిషన్ లో సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్నాయి. దాని ప్రకారమే తాము చేశామని, అయితే కాల్స్ లో ఏముందన్న దానితో తమకు సంబంధం లేదని తెలిపాయి. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు, అధికారిక రహస్యాలను బయట పెట్టరాదంటూ తెలంగాణ ప్రభుత్వం వీరిని ఆదేశించిందట. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా ట్యాపింగ్ కు సంబంధించి తమపై ఒత్తిడి పెంచడంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తిందని సర్వీస్ ప్రొవైడర్లు వాపోతున్నాయి.

  • Loading...

More Telugu News