: 'బాహుబలి' సినిమాను వీక్షించిన గవర్నర్ దంపతులు


ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో, బాహుబలిని గవర్నర్ దంపతులు తిలకించారు. హైదరాబాదు, బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో వీరి కోసం ఈ సినిమాను నిన్న సాయంత్రం ప్రత్యేకంగా ప్రదర్శించారు. గవర్నర్ నరసింహన్ తో పాటు ఆయన సతీమణి విమల, ఇతర కుటుంబ సభ్యులు బాహుబలిని తిలకించారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News