: నేటితో ముగియనున్న పుష్కరాలు... గోదారికి పోటెత్తిన భక్తజనం
పవిత్ర గోదావరి మహా పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. నేటి సాయంత్రం 6.38 గంటలకు ముగియనున్న పుష్కరాలకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. బాసరలో తెలంగాణ ప్రభుత్వం, రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ లో ఏపీ ప్రభుత్వం పుష్కరాల ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదారి తీరానికి చేరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుష్కర ఘాట్లు భక్తజన సందోహంతో నిండిపోయాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.