: ఈ యాప్ తో 'హంగామా' చేయొచ్చు!
స్మార్ట్ ఫోన్ల రంగప్రవేశం తర్వాత యాప్ లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి యాప్ రూపొందిస్తున్నారు. అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుతున్నారు. తాజాగా, 'హంగామా' సంస్థ ఓ కొత్త యాప్ విడుదల చేసింది. దీనిపేరు 'హంగామా ప్లే'. ఈ యాప్ ద్వారా మొబైల్ ఫోన్, ట్యాబ్ లో 6,500 సినిమాల వరకు వీక్షించవచ్చట. సబ్ స్క్రిప్షన్ చార్జ్ నెలకు రూ.249 మాత్రమే. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రాంతీయ భాషల చిత్రాలను కూడా అందిస్తున్నామని సంస్థ సీఈవో సిద్ధార్థ రాయ్ వివరించారు. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి.