: రాహుల్ అంత అసమర్థ నాయకుడు దేశంలోనే లేరు: సోమిరెడ్డి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అంత అసమర్థ నాయకుడు దేశంలోనే మరొకరు అన్నారు. అసలు రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరారని తేల్చిచెప్పారు. రైతులను మభ్యపెట్టేందుకే రాహుల్ గాంధీ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను ఆదుకునేందుకే పట్టిసీమను తలపెట్టామని ఆయన తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ వైఖరి ఇంకా స్పష్టం చేయలేదని ఆయన విమర్శించారు.