: భారత్ లో 5 కోట్ల మంది మానసిక రోగులు
భారత దేశంలో డిప్రెషన్ (కుంగుబాటు), ఆత్రుత వంటి మానసిక సమస్యలతో సుమారు 5 కోట్ల మంది (50 మిలియన్లు) ఇబ్బంది పడుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాశ్ నడ్డా లోక్ సభకు తెలిపారు. మానసిక ఆందోళన కారణంగా గతేడాది సుమారు ఏడు వేల మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన వెల్లడించారు. మానసిక సమస్యల కారణంగా 2012లో 7,769 మంది, 2013లో 8,006 మంది, 2014లో 7,104 మంది మరణించినట్టు ఆయన సభకు తెలిపారు. అలాగే దేశంలో 3800 మంది సైకాలజిస్టులు, 898 మంది క్లినికల్ సైకాలజిస్టులు, 850 మంది సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, 1500 మంది సైకియాట్రిక్ నర్సులు ఉన్నట్టు వెల్లడించింది. కేంద్రం ఆధ్వర్యంలో 3, రాష్ట్రాల ఆధ్వర్యంలో 40 మానసిక చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. వైద్య విద్య కళాశాలల్లో 398 మానసిక వైద్య విభాగాలు నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.