: నేను రాజకీయాల్లోకి రావడం లేదు: హీరోయిన్ త్రిష
రాజకీయాల్లోకి తాను రాబోతున్నానని, సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే పార్టీలో చేరబోతున్నానంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హీరోయిన్ త్రిష తాజాగా స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఈ వార్తలను ఖండిస్తూ... రాజకీయాల్లోకి రావడం లేదంటూ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది. "నేను రాజకీయాల్లో చేరడం లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చేరను. నా పని నేను చూసుకుంటా. విశ్రాంతి తీసుకుంటా" అని త్రిష ట్వీట్ చేసింది.