: హైదరాబాదును డల్లాస్ నగరంగా తీర్చిదిద్దే దిశగా తొలి అడుగు వేసిన కేసీఆర్
హైదరాబాదును అమెరికాలోని డల్లాస్ నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. జంట నగరాల్లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్ల నిర్మాణానికి ఈరోజు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రూ. 2,630 కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. తొలి దశలో 20 చోట్ల ఈ ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. రెండున్నరేళ్లలో వీటి నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈపీపీ పద్ధతిలో ఈ పనులను చేపట్టాలని నిర్ణయించారు.