: ఈ సినిమాలో అందరూ తెలంగాణ కళాకారులే... ఆనందంగా ఉంది: నాయిని


తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి 'ఇండియన్ పోస్ట్ మ్యాన్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాదు ఫిలింనగర్ లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ... ఈ సినిమాలో అందరూ తెలంగాణ కళాకారులే ఉన్నారని, తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా నిర్మించడం పట్ల దర్శకుడు రమేశ్ రెడ్డిని అభినందించారు. చిన్న సినిమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. అనంతరం దర్శకుడు రమేశ్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమాను తెలుగు, ఆంగ్లంలో రూపొందించామని చెప్పారు. ఇతర దేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ ను విడుదల చేయడం కష్టమనిపించడం లేదని, కానీ, ఇక్కడ తెలుగులో విడుదల చేయడం కష్టంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News