: కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు: యనమల


ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ ఉంటే ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాడడం లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను సీఎం చంద్రబాబు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News