: నాగార్జున వర్సిటీ ఆత్మహత్య ఘటనను సుమోటోగా తీసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ


గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనను జిల్లా లీగల్ సెల్ అథారిటీ సుమోటోగా తీసుకుంది. ఆ వెంటనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణికి నోటీసులు పంపించింది. ఈ ఘటనపై వర్సిటీలో నిన్న(గురువారం) నిజనిర్ధారణ కమిటీ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సమయంలో సస్పెన్షన్ కు గురైన ప్రిన్సిపల్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఆత్మహత్యపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News