: ఎంత మాత్రమూ తగ్గని ధోనీ బ్రాండ్!


తన కెప్టెన్సీలో టీమిండియా పరాజయాల పాలైనా, టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించినా, మహేంద్ర సింగ్ ధోనీ వాణిజ్య విలువ ఎంతమాత్రమూ తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా టాప్-10 స్పోర్ట్స్ పర్సన్స్ (మోస్ట్ మార్కెటబుల్) జాబితాలో మహీకి 9వ స్థానం లభించింది. లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ విడుదల చేసిన ఈ జాబితాలో స్విస్ టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ తొలి స్థానంలో నిలువగా, గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్ రెండో స్థానంలో నిలిచాడు. ధోనీ కన్నా ముందు జకోవిచ్ 7వ స్థానంలో, నాదల్ 8వ స్థానంలో ఉన్నారు. కాగా, ఫుట్ బాల్ సూపర్ స్టార్లు క్రిస్టియానా రొనాల్డో, లియోనిల్ మెస్సీ, అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ ల కన్నా ధోనీ అధిక బ్రాండ్ వాల్యూ ఉన్న ఆటగాడుగా నిలవడం గమనార్హం. ఇదే జాబితాలో టెండూల్కర్ 78వ స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News